ఫేస్ బుక్ మెసెంజర్ లో కొత్త ఫీచర్.. మెసేజ్ అన్ సెండ్ ఆప్షన్

ఫేస్ బుక్ మెసెంజర్ లో కొత్త ఫీచర్.. మెసేజ్ అన్ సెండ్ ఆప్షన్

ఫేస్ బుక్ మెసేంజర్ లో చాట్ చేసే అలవాటు ఉందా? అప్పుడప్పుడు పొరబాటుగా పంపకూడని మెసేజెస్ పంపి.. తర్వాత వివరణ ఇచ్చుకుని బాధపడుతున్నారా? ఇక ఆ తలనొప్పి ఉండబోదు. వాట్సాప్ లో ఉన్న అన్ సెండ్ మెసేజ్ ఫీచర్ ను ఫేస్ బుక్ మెసెంజర్ కూడా అందుబాటులోకి తెచ్చింది. 10 నిమిషాల్లోపే మీరు పంపిన మెసేజ్ ను పొరబాటు అని గుర్తిస్తే చాలు. దాన్ని ‘డిలీట్ ఎవ్రివన్’ కొడితే ఆ మెసేజ్ ఇక ఇద్దరికీ కనబడదు.

సింపుల్ ప్రాసెస్

  • మెసెంజర్ లో పంపిన మెసేజ్ ను అన్ సెండ్ చేయడం చాలా సింపుల్.
  • పొరబాటుగా పంపిన మెసేజ్ ను ట్యాప్ చేసి పట్టుకోవాలి.
  • కింద కాపీ, రిమోవ్, ఫార్వర్డ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • వాటిలో రిమోవ్ సెలెక్ట్ చేస్తే.. రిమోవ్ ఎవ్రివన్, రిమోవ్ ఫర్ యూ అని రెండు ఆప్షన్లు వస్తాయి.
  • రిమోవ్ ఎవ్రివన్ సెలెక్ట్ చేస్తే చాలు. మీరు పంపిన మెసేజ్ ఇద్దరి ఫోన్లలోనూ డిలీట్ అయిపోతుంది.
  • మెసేజ్ పంపిన 10 నిమిషాల్లోనే ఇది వీలవుతుందని మెసెంజర్ ప్రోడక్ట్ మేనేజర్ ఇస్కికియాన్ తెలిపారు.

అయితే దీనికి ముందు మెసెంజర్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్, ఐవోస్ ఫోన్లన్నింటీలోనూ ఈ కొత్త ఫీచర్ వచ్చేసింది.