మానకొండూరు, వెలుగు: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకల జీపీ పరిధిలోని పెద్ద బంజర్ పల్లిలో బుధవారం జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు తోట మల్లయ్య(77) అనారోగ్యంతో మంగళవారం రాత్రి చనిపోయాడు.
బుధవారం ఉదయం అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు సిద్ధమవుతుండగా మల్లయ్య భార్య రాజ్యలక్ష్మి (70) భర్త డెడ్‌బాడీ వద్ద ఏడుస్తూ కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. వృద్ధ దంపతులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. బుధవారం మధ్యాహ్నం దంపతులిద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు.