మహదేవపూర్, వెలుగు: అనారోగ్యంతో తమ్ముడు చనిపోవడంతో తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బెగులూరులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బెగలూరుకు చెందిన పొట్లపెల్లి రాజయ్య (34) తమ్ముడు రామచంద్రం మూడు నెలల కింద అనారోగ్యంతో చనిపోయాడు. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక మద్యానికి బానిస అయ్యాడు. రామచంద్రంను తలచుకుంటూ తరచూ బాధపడేవాడు. అదే బాధతో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఇంటి వెనుక ఉన్న పందిరికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.