వేధింపులు తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం

వేధింపులు తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
  • భార్య మృతి, చికిత్స పొందుతున్న భర్త 

నెల్లికుదురు, వెలుగు : వేధింపులు భరించలేక భార్యాభర్తలు పురుగుల మందు తాగడంతో భార్య చనిపోగా, భర్త హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా నెల్లికుదురు మండలంలో పెద్దతండాలో సోమవారం జరిగింది. తండాకు చెందిన బానోతు భద్రు, నీలమ్మ (39) భార్యాభర్తలు. నీలమ్మను గతంలో అదే తండాకు చెందిన బానోతు వీరన్న  లైంగికంగా వేధించేవాడు. ఈ విషయం నీలమ్మ కుటుంబ సభ్యులకు తెలియడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి మరోసారి నీలమ్మ జోలికి రావొద్దని వీరన్నను హెచ్చరించారు. అయినప్పటికీ వీరన్న తరచూ నీలమ్మను వేధించేవాడు.

ఈ క్రమంలో 29న సాయంత్రం నీలమ్మ ఇంటికి వెళ్లి మరోసారి వేధించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక నీలమ్మ, భద్రు శనివారం పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ తొర్రూరులోని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ సోమవారం నీలమ్మ చనిపోగా, భద్రు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నాడు. మృతురాలి సోదరుడు కిషన్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు నెల్లికుదురు ఎస్సై క్రాంతి కిరణ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

కుటుంబ కలహాలతో తల్లీ, ముగ్గురు కూతుళ్లు...

కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ముగ్గురు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మండలం గజ్జిగూడకు చెందిన చిలుకూరి ప్రతాప్‌‌‌‌‌‌‌‌, అనితకు అయిదుగురు అమ్మాయిలు. పెద్దకూతురుకు పెండ్లి అవడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉంటోంది. తాగుడుకు బానిసైన ప్రతాప్‌‌‌‌‌‌‌‌ మద్యం మత్తులో అనితను నిత్యం వేధిస్తూ, గొడవ పడేవాడు. ఈ క్రమంలో సోమవారం కూడా గొడవ జరిగింది. దీంతో  మనస్తాపానికి గురైన అనిత నలుగురు కూతుర్లు లక్ష్మి, రమ్య, ఐశ్వర్య, రవళితో కలిసి పొలం వద్దకు వెళ్లింది.

అక్కడ నలుగురు కూతుళ్లకు పురుగుల మందు ఇవ్వగా రవళి తాగలేదు. తర్వాత అనిత కూడా పురుగుల మందు తాగింది. తల్లితో పాటు ఇద్దరు అక్కలు, చెల్లెలు అపస్మారక స్థితిలోకి చేరుకోగా రవళి అరవడంతో గమనించిన కూలీలు, గ్రామస్తులు అక్కడికి వచ్చారు. నలుగురిని కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. లక్ష్మి, రమ్య పరిస్థితి ఉందని డాక్టర్లు చెప్పారు. విషయం తెలుసుకున్న సీఐ రాంబాబు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వచ్చి వివరాలు సేకరించారు.