మల్హర్, వెలుగు : తల్లి మృతిని తట్టుకోలేక పురుగుల మందు తాగి కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మల్హర్ మండలం ఎడ్లపల్లికి చెందిన మంథని సౌమ్య(19) తల్లి దుర్గమ్మ 8 నెలల కింద చనిపోయింది. అప్పటినుంచి సౌమ్య మనోవేదనకు గురవుతుండగా ఆదివారం ఆమె పురుగుల మందు తాగింది.
తండ్రి దుర్గయ్య వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తీసుకెళ్లగా చికిత్సపొందుతూ మంగళవారం సౌజన్య మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొయ్యూరు ఎస్ఐ నరేశ్ తెలిపారు.