ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ల కోసం అప్పులు.. తీర్చలేక యువకుడు సూసైడ్‌‌‌‌‌‌‌‌

పెన్‌‌‌‌‌‌‌‌పహాడ్, వెలుగు : ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ల కోసం అప్పులు చేసిన ఓ యువకుడు అవి తీర్చలేక ఈ నెల 17న హాలియా వద్ద సాగర్‌‌‌‌‌‌‌‌ కాల్వలో దూకాడు. సూర్యాపేట జిల్లా దోసపహాడ్‌‌‌‌‌‌‌‌ వద్ద సోమవారం అతడి డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ దొరికింది. నల్గొండ జిల్లా తడకమళ్లకు చెందిన సాయికుమార్‌‌‌‌‌‌‌‌ (28) ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌లు వేసేవాడు. వీటి కోసం సుమారు రూ. 2 కోట్ల వరకు అప్పులు చేశాడు.

బెట్టింగ్‌‌‌‌‌‌‌‌లో నష్టం రావడంతో అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో ఈ నెల 17న ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసి హాలియా చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌ 14వ మైలు వద్ద సాగర్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాల్వలో దూకాడు. కాల్వలో కొట్టుకువచ్చిన సాయికుమార్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ సోమవారం సూర్యాపేట జిల్లా పెన్‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌ మండలం దోసపహాడ్‌‌‌‌‌‌‌‌ వద్ద కాల్వలో దొరికింది. మృతుడి సోదరుడు సంతోష్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పెరిక రవీందర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.