బాకీ తీర్చలేకపోయాననే మనస్థాపంతో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ రాష్ట్ర సీఎం కమల్ నాథ్ సొంత నియోజకవర్గం చింద్వారాలోని మేఘాస్విని గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన ఆకడు యుకే అనే రైతు తన కూతురి పెళ్లి కోసం.. గ్రామంలోని తనకు తెలిసిన ఓ భూస్వామి వద్ద రూ.9,000 అప్పుగా తీసుకున్నాడు. నాలుగు సంవత్సరాల నుంచి పంటలు సరిగా పండకపోవడంతో ఆ అప్పు తీర్చలేకపోయాడు.
ఈ బాధతో కొన్ని రోజులుగా మనస్థాపానికి గురైన ఆ రైతు తన పొలంలోని షెడ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. విడతల వారీగా అప్పు తీర్చే శక్తి తమకు ఉందని, అప్పు తీర్చమని సదరు భూస్వామి కూడా ఎలాంటి ఒత్తిడి తేలేదని మృతుడి భార్య సకల్ భక్తి తెలిపింది.
పార్టీకి ముందు ఎన్నికల వాగ్దానం ప్రకారం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రుణాలను రద్దు చేసింది. చివరకి కమల్ సొంత నియోజక వర్గంలోనే తొమ్మిది వేల రూపాయల కోసం రైతు ఉరి వేసుకోవడం విషాదంగా మారింది.