లోన్‌‌ యాప్స్‌‌ వేధింపులు తట్టుకోలేక స్టూడెంట్‌‌ ఆత్మహత్య

ఖిలావరంగల్‌‌ (కరీమాబాద్), వెలుగు: లోన్‌‌ యాప్స్‌‌ వేధింపులు తట్టుకోలేక ఓ స్టూడెంట్‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్‌‌ నగరంలోని కరీమాబాద్‌‌లో బుధవారం జరిగింది. కరీమాబాద్‌‌ జన్మభూమి జంక్షన్‌‌ ప్రాంతానికి చెందిన కమ్మంపాటి యాకయ్య కుమారుడు విష్ణువర్ధన్‌‌ (23) ఓ ప్రైవేట్‌‌ కాలేజీలో ఎంబీఏ సెకండ్‌‌ ఇయర్‌‌ చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆన్‌‌లైన్‌‌ లోన్‌‌ యాప్స్‌‌ను డౌన్‌‌లోడ్‌‌ చేసుకొని రూ.

60 వేలు అప్పుగా తీసుకున్నాడు. అలాగే మరో రూ.2.40 లక్షలను తన ఫ్రెండ్స్‌‌కు ఇప్పించాడు. ఈ డబ్బులతో బెట్టింగ్‌‌ పెట్టేవాడు. తాను తీసుకున్న లోన్‌‌కు సంబం ధించిన ఈఎంఐలను సరిగానే చెల్లించినప్పటికీ, ఫ్రెండ్స్‌‌కు ఇప్పించిన లోన్‌‌ ఈఎంఐలు వారు సరైన టైంలో చెల్లించడం లేదు. దీంతో లోన్‌‌ యాప్‌‌కు సంబం ధించిన వ్యక్తులు విష్ణువర్ధన్‌‌కు తరచుగా ఫోన్‌‌ చేసి, లోన్‌‌ చెల్లించాలని వేధింపులకు గురిచేసేవారు.

దీంతో మనస్తాపానికి గురైన విష్ణువర్ధన్‌‌ మంగళవారం అర్థరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న టైంలో ఉరి వేసుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు చూసేవరకే చనిపోయాడు. దీంతో మిల్స్‌‌ కాలనీ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.