డీఎల్ఎఫ్​ రోడ్డులోని ఫుడ్​కోర్టు కూల్చివేత

డీఎల్ఎఫ్​ రోడ్డులోని ఫుడ్​కోర్టు కూల్చివేత

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలో పర్మిషన్​లేకుండా నిర్మించిన ఫుడ్ కోర్టును శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూల్చివేశారు. డీఎల్ఎఫ్​బిల్డింగ్​సమీపంలో కొంత కాలంగా ఏఎం అండ్​పీఎం పేరుతో ఫుడ్​కోర్టు నిర్వహిస్తున్నారు. అయితే అది అక్రమ నిర్మాణం అని పలువురు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఫుడ్​కోర్టు బిల్డింగ్​ను కూల్చివేయాలని కోరారు.

విచారణలో అక్రమ నిర్మాణం అని తేలడంతో కూల్చివేతకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం రెండు జేసీబీలతో ఏఎం అండ్ పీఎం ఫుడ్ కోర్టును నేలమట్టం చేశారు. పోలీసులు బందోబస్తు కల్పించారు.