
మియాపూర్, వెలుగు: శేరిలింగంపల్లి జోన్ మియాపూర్ డివిజన్ నాగార్జున ఎన్క్లేవ్ లోని ఓ భారీ చెట్టును ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించారు. బిల్డింగ్నిర్మాణ పనులకు అడ్డొస్తుందని అడ్డంగా నరికి, ముక్కలుగా చేసి ఆటోలో తరలించారు. భారీ చెట్లను తొలగించాలంటే జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ అధికారుల అనుమతి తప్పనిసరి. అవేమీ లేకుండానే చెట్లను నరికేస్తున్నారు. చెట్ల నరికివేతపై చందానగర్సర్కిల్ అర్బన్ బయోడైవర్సిటీ అధికారులను వివరణ కోరగా.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నరికి వేసినట్లు గుర్తించామన్నారు.
నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే డివిజన్రెడ్డికాలనీలో కొన్నాళ్ల కింద అక్రమంగా ఓ భారీ షెడ్నిర్మించారు. షెడ్కార్యకలాపాలకు అడ్డొస్తున్నాయని అక్కడి రెండు భారీ చెట్లను నరికేశారు. మరో చెట్టు కొమ్మలను కొట్టేశారు.