![గ్రేటర్ వరంగల్ లో వాటర్ దందా..!](https://static.v6velugu.com/uploads/2025/02/unauthorized-water-plants-in-greater-warangal-pose-health-risks-to-consumers_9623uOh4UT.jpg)
- నగరంలో ఇష్టారీతిన వెలుస్తున్న నీళ్ల ప్లాంట్లు
- కనీస ప్రమాణాలు పాటించకుండానే ఏర్పాటు
- వందల కొద్దీ ప్లాంట్లలో పర్మిషన్ పదమూడింటికే..
- తనిఖీలు మరిచిన ఆఫీసర్లు
- క్వాలిటీ లేని నీళ్లతో జనాల హెల్త్ పై ప్రభావం
హనుమకొండ, వెలుగు: ఎండాకాలం వచ్చిందంటే గ్రేటర్వరంగల్లో నీళ్ల దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కనీస ప్రమాణాలు పాటించకుండానే గల్లీకో ప్లాంట్తెరవడం, ఇష్టమొచ్చినట్టు ఫిల్టర్ చేసి జనాలకు సరఫరా చేయడం కామనైపోయింది. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన మిషన్ భగీరథ నీళ్లకు జనాలు అలవాటుకాకపోవడంతో దానిని ఆసరాగా తీసుకుని కొంతమంది అసలు నీళ్ల క్వాలిటీ ఎలా ఉందనే టెస్టులు కూడా చేయించకుండానే శుద్ధి చేసిన పేరుతో క్యాన్లలో నింపి అమ్మేస్తున్నారు.
ఆ పనికిరాని నీళ్లను తాగుతున్న జనాలు రోగాలతోపాటు కీళ్లు, కాళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. ప్రజారోగ్యాన్ని రక్షించాల్సిన అధికారులు పర్మిషన్ లేని ప్లాంట్లలో తనిఖీల విషయాన్ని పక్కనపెట్టేశారు. దీంతో అడిగేవారు లేక సందుకో వాటర్ ప్లాంట్ పుట్టుకొస్తోంది.
పర్మిషన్ పదమూడింటికే..
వరంగల్ నగరంలో రూ.630 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టినా చాలాచోట్ల లీకేజీలు, రంగుమారిన నీళ్లు సప్లై కావడంతో చాలామంది ప్యూరిఫైడ్ వాటర్ కే అలవాటుపడ్డారు. జనాల్లో డిమాండ్ ఎక్కువవడంతో గ్రేటర్వరంగల్ పరిధిలో దాదాపు 500కుపైగా వాటర్ ప్లాంట్లు ఏర్పడ్డాయి. కానీ, పర్మిషన్మాత్రం అందులో కనీసం పది శాతం వాటికి కూడా లేకపోవడం గమనార్హం. వాస్తవానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రెవెన్యూ, గ్రౌండ్‌వాటర్, ఫుడ్‌సేఫ్టీ, గ్రేటర్పబ్లిక్హెల్త్ఆఫీసర్లతోపాటు రీజినల్పబ్లిక్హెల్త్ల్యాబొరేటరీలో నీటిని టెస్ట్చేసిన సర్టిఫికెట్తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటు ఐఎస్ఐ, బీఎస్ఐ సర్టిఫికెట్‌కూడా అవసరం. కానీ, ఇక్కడ అదంతా ఏమీ పట్టించుకోకుండా వందల సంఖ్యలో వాటర్ప్లాంట్లు వెలుస్తున్నాయి. నగర వ్యాప్తంగా కేవలం 13 ప్లాంట్లకు మాత్రమే పర్మిషన్ ఉండగా, మిగతావన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అన్నిట్లో పనికిరాని నీళ్లే..!
ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లపై ఫిర్యాదులు అందడంతో పబ్లిక్హెల్త్ఆఫీసర్లు దాదాపు మూడేండ్ల కిందట క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. సిటీ పరిధిలోని దాదాపు 40 ప్లాంట్ల నుంచి నీటి శాంపిల్స్ సేకరించి హనుమకొండలోని రీజినల్ పబ్లిక్‌హెల్త్ టెస్టింగ్ల్యాబ్లో పరీక్షలు చేయించారు. వాటిలో ఏ ఒక్క ప్లాంట్నీళ్లు కూడా తాగడానికి పనికిరావని నిర్ధారించి, వాటికి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ, అందులో కొన్ని వాటర్ప్లాంట్లు అప్పటి అధికార పార్టీ లీడర్లకు సంబంధించినవి ఉండటం, మరికొన్నింటికీ వారి అండదండలు ఉండటంతో తనిఖీల పేరున హడావుడి చేసిన అధికారులు ఆ వాటర్ ప్లాంట్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండానే వదిలేశారు. ఆ తర్వాత కూడా దీని గురించి పట్టించుకునే నాథులే లేక నగరంలో వాటర్ దందా యథేచ్ఛగా సాగుతోంది.
టెస్టులు లేకుండానే సప్లై..
వాస్తవానికి వాటర్ ప్లాంట్ల నీటిని కనీసం మూడు నెలలకోసారైనా టెస్టింగ్చేయించాల్సి ఉంటుంది. నీటిలో ఇన్ఫెక్టివ్బ్యాక్టీరియా, ఫ్లోరైడ్, కెమికల్స్స్థాయిల గురించి పరీక్షలు చేయించాలి. కానీ, ఇక్కడ టెస్టుల విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్లాంట్ల నిర్వాహకులు తమకు తోచినట్టుగా కెమికల్స్ కలిపి క్యాన్లలో నింపి అమ్మేస్తూ ప్రతి నెలా నగర వ్యాప్తంగా రూ.ఐదారు కోట్ల దందా సాగిస్తున్నారు.
ఇలా అరకొరగా శుద్ధి చేసిన నీటితో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుండగా, ఆఫీసర్లు కూడా లైట్తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా గ్రేటర్ఉన్నతాధికారులు స్పందించి, సరైన ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకుని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
టెస్టులకు రావడం లేదు..
వాటర్ ప్లాంట్ ఏర్పాటు సమయంలోనే రీజినల్ల్యాబ్నుంచి సర్టిఫికెట్తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఎలాంటి ప్రమాణాలు పాటించకుండానే ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. నీటిని సప్లై చేసేందుకు క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇందుకు ప్రతి మూడు నెలలకోసారి నీటిని టెస్ట్చేయించాలి. ఆ నిబంధన కూడా ఎవరూ పాటించడం లేదు.- శ్రీకృష్ణారావు, సివిల్సర్జన్బ్యాక్టీరియాలజిస్ట్, రీజినల్పబ్లిక్ హెల్త్ల్యాబ్
రూల్స్ పాటించని వాటిపై యాక్షన్ తీసుకుంటం..
నిబంధనలు పాటించని వాటర్‌ప్లాంట్లకు గతంలో నోటీసులు ఇచ్చి జరిమానాలు కూడా విధించాం. ల్యాబ్ రిపోర్ట్స్తోపాటు వివిధ శాఖల అనుమతి ఉంటేనే వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి. అలాకాకుండా ఇష్టమొచ్చినట్లు ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ఊరుకోం. నిబంధనలు పాటించకుండా ప్రజారోగ్యంతో చెలగాటమాడితే ప్లాంట్లపై సీరియస్యాక్షన్ తీసుకుంటాం.- డా.రాజారెడ్డి, సీఎంహెచ్వో, జీడబ్ల్యూఎంసీ