పాలసీ దారులు చేస్తున్న తప్పిదాలతో.. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.22 వేల కోట్ల క్లెయిమ్ చేయని ఫండ్

ప్రస్తుతం ఉన్న బిజీ ప్రపంచంలో జీవిత బీమా (life insurence) అనేది తప్పని సరి అయ్యింది. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. అందుకే కుటుంబ పెద్దకు ఏదైనా జరిగినా తనను నమ్ముకొని ఉన్న కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ (వార్షిక బీమా), లైఫ్ ఇన్సూరెన్సు (జీవిత బీమా)లు తీసుకుంటుంటారు. అయితే పాలసీ తీసుకునే సమయంలో అవగాహన లోపంతో చేసే చిన్న పొరపాట్ల వలన ఆ కుంటుంబానికి రావాల్సిన మొత్తం కొన్ని సార్లు రాకుండా పోతుంది. మెచ్యూరిటీ అయినా కూడా నామినీ విషయంలో చేసిన పొరపాట్ల కారణంగా ఆ మొత్తం సెటిల్ మెంట్ కాకపోవడంతో కంపెనీల అకౌంట్లలోనే ఉండిపోతుంది.

 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద 2024 ఆర్థిక సంవత్సరం రూ.22,237 కోట్ల అన్ క్లైమ్ డ్ ఎమౌంట్ ఉందని IRDAI (Insurance Regulatory and Development Authority of India) నివేదిక ద్వారా తెలుస్తోంది. అదే ఆర్థిక సంవత్సరం జూన్ నుంచి నవంబర్ వరకు అంటే దాదాపు ఆరె నెలల స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆ మొత్తాన్ని రూ. 1,018 కోట్ల రూపాయలకు తగ్గించారట. అంటే సగానికి పైగా సెటిల్ మెంట్ చేయించినట్లు నివేదిక ఆధారంగా తెలుస్తుంది. ఇంత మొత్తం జీవితా బీమా కంపెనీల వద్ద మిగిలి పోవడానికి కారణం .. బీమా చేసుకునే సమయంలో నామినీ ఎంపికలో పొరపాట్లు చేయడమే. కుటుంబ సంభ్యులు కాకుండా ఇతర బయటి వ్యక్తులను నామినీలుగా చేర్చినపుడు క్లైమ్ చేసుకునే సమయానికి చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయట. దీంతో పాలసీదారుడు పొరపాటున చనిపోయినా లేదంటే మెచ్యూరిటీ అయినప్పటికీ రావాల్సిన మొత్తం కుటుంబానికి రాకుండా కంపెనీల ఖాతాలోనే ఉండిపోతుంది. నామినీలుగా కుటుంబ సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులను చేర్చినపుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. 

ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏ చేయాలి:

  • పాలసీ దారుడు కాంటాక్ట్ నంబర్, అడ్రస్ తదితర డీటైల్స్ అప్ డేట్ చేసుకోవాలి
  • పాలసీ తీసుకునే వ్యక్తి  కేవైసీ (KYC) సరిగ్గా అయిందో లేదో చెక్ చేసుకోవాలి
  • నామినీ వివరాలు సరైనవో లేదో సరిచూసుకోవాలి
  • కుటుంబ సభ్యులనే నామినీలుగా చేర్చుకోవడం తప్పనిసరి
  • పాలసీ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు తప్పకుండా తెలియజేయాలి
  • ఏజెంట్లతో కాంటాక్ట్ లో ఉండాలి

కొన్ని సందర్భాలలో నామినీకి సంబంధించి అడ్రెస్ దొరక్కపోవడం, అందుబాటులో లేకపోవడంతో ఫండ్ వారికి ఇవ్వడానికి వీలు కుదరడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ఎందుకంటే వారి అడ్రస్ మారి పోవడం, కుటుంబ పరిస్థితులలో ఏవైనా మార్పులు రావడం తదితర కారణాల వలన ఇల్లు, ఊరు మారడం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులలో సదరు కంపెనీకి వివరాలు ఇవ్వడం, కేవైసీ మార్చుకోవడం, ఏజెంట్లతో కాంటాక్ట్ లో ఉండటం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు.

కంపెనీలు కూడా చొరవ తీసుకోవాలి:

పాలసీ దారుల ఫండ్ ను సెటిల్ మెంట్ చేయడంలో కంపెనీలు కూడా చొరవ తీసుకోవాల్సి ఉంటుందని ఐఆర్డీఏఐ చెబుతోంది. నామినీలకు అవగాహన లేకపోవడంతో వాళ్లు క్లైమ్ చేసుకోకపోవచ్చు. అలాంటప్పుడు ఏజెంట్ల ద్వారా వారితో టచ్ లో ఉండి, పాలసీ వివరాలు, సెటిల్ మెంట్ వివరాలు ఎప్పటికప్పుడు ఆ కుటుంబానికి అందించడం అవసరం.

నామినీలుగా ఇతరులను చేర్చితే సెటిల్ మెంట్ చేయడం కుదరదా?

పాలసీ దారుడు కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులను నామినీలుగా చేర్చినప్పుడు మెచ్యూరిటీ తర్వాత ఫండ్ సెటిల్ చేయవచ్చు. కానీ కచ్చితంగా ఆ ఫండ్ ను కుటుంబ సభ్యులకు, వారసులకు అందిచాల్సి ఉంటుంది. నామినీ ఆ మొత్తాన్ని తీసుకునే హక్కు ఉండదు. 

ALSO READ | సంక్రాంతి షాపింగ్ లో బిజీబిజీగా ఉన్నారా..? బంగారం ధర మళ్లీ పెరిగింది

ఉదాహరణకు ఒక వ్యక్తి తన భార్య లేదా వారసులు కాకుండా తన గర్ల్ ఫ్రెండ్ ను నామినీగా చేర్చాడనుకుంటే.. మెచ్యూరిటీ పూర్తయ్యే నాటికి ఆ గర్ల్ ఫ్రెండ్ కు సెటిల్ మెంట్ చేస్తాయి కంపెనీలు. కానీ పాలసీదారుడి వారసులకు ఇవ్వడానికి అంగీకరిస్తేనే లేదంటే కంపెనీ దగ్గరే ఉండిపోతుంది ఆ మొత్తం. 

అదేవిధంగా కుటుంబంతో సంబంధంలేని నామినీ ఉన్నపుడు చట్ట పరంగా వారసులు కోర్టులో సవాల్ చేసే హక్కు ఉంటుంది. అందువలన ముందుగానే పాలసీ దారుడు కుటుంబ సభ్యులను మాత్రమే నామినీలుగా చేర్చడం ఉత్తమం. అలా చేయకపోవడం, నామినీలకు ఆ పాలసీపై అవగాహన లేకపోవడం లేదంటే పాలసీ చేసినట్లు కుటుంబానికి చెప్పకపోవడం తదితర సమస్యలతో కంపెనీల దగ్గర అన్ క్లైమ్ డ్ ఎమౌంట్ మిగిలిపోతుంది. 

నాన్ బెనిఫీషియల్ నామినీ (కుటుంబానికి సంబంధంలేని) అపాయింట్ అయితే.. వారసులు ఆ ఫండ్ కు హక్కుదారులు అవుతారని ఎడిల్ వైస్ సంస్థ చెబుతోంది. అదే విధంగా ఇలాంటి సమస్యలు రాకూడదంటే వెంటనే కుటుంబ సభ్యులను నామినీలుగా మార్చుకోవాలని లైఫ్ 
ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (LIC) సూచిస్తుంది.