మామ, అల్లుడి మధ్య గొడవ.. ఇద్దరూ స్పాట్ డెడ్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండె నెమ్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల కారణంగా మామ, అల్లుడు మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో ఇద్దరూ స్పాట్ లోనే చనిపోయారు. శాంతపూర్ గ్రామానికి చెందిన సంతుకు గుండె నెమ్లి గ్రామానికి చెందిన అరుణతో కొన్నేండ్ల కిందట పెండ్లి జరిగింది. 

పుట్టింటి వద్దే ఉంటున్న అరుణను భర్త కర్రతో కొట్టాడు. అయితే తన కూతురిని ఎందుకు కొడుతున్నావని అడిగిన మామ రాంబోయిపైనా అల్లుడు దాడిచే శాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రాంబొయి కుటుంబీకులు సంతును విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మామ, అల్లుడు స్పాట్లోనే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.