మంగపేట, వెలుగు : తన కూతురిని ఇబ్బంది పెడుతున్నాడంటూ ఓ వ్యక్తి కొడవలితో అల్లుడిపై దాడి చేశాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం రామచంద్రుని పేటలో గురువారం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పడిగేరు గ్రామానికి చెందిన నాంపెల్లి విజయ్‌కి ములుగు జిల్లా మంగపేట మండలం రామచంద్రునిపేట గ్రామానికి గోడెసాల వెంకన్న కూతురు మౌనికతో తొమ్మిదేళ్ల కింద పెండ్లి జరిగింది.
రెండు నెలల కింద భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మౌనిక తన పుట్టింటికి వచ్చింది. విజయ్ తన భార్యను తీసుకెళ్లడానికి గురువారం రామచంద్రునిపేటకు వచ్చాడు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి మాట్లాడుతుండగా వెంకన్న తన తమ్ముడు శ్రీను కలిసి కొడవలితో విజయ్‌పై దాడి చేశారు. గాయపడిన విజయ్‌ని స్థానికుల సాయంతో మణుగూరు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.