జగిత్యాల జిల్లాలో మూత వేయకుండా ఉన్న డ్రైనేజీలో పడిపోయి గణేశ్ అనే మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెట్ పల్లి పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న ఓ దుకాణం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
మూత వేయకుండా వదిలేసిన డ్రైనేజీలో పడి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన ఈనెల 23న జరిగినట్టు తెలుస్తోంది. హోటల్ వైపు నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఫిట్స్ వచ్చి డ్రైనేజీలో పడిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అసంపూర్తి పనుల వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు స్థానికులు ఆరోపించారు. అందువల్లనే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారు ఇలా డ్రైనేజీలో పడిపోయి మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.