లక్ష్మణచాంద, వెలుగు: అండర్14 జోనల్ స్థాయి కబడ్డీ పోటీలు లక్ష్మణచాంద మండల కేంద్రంలోని గవర్నమెంట్హైస్కూల్లో శనివారం ఘనంగా జరిగాయి. డీఈఓ రవీందర్ రెడ్డి చీఫ్‌గెస్ట్‌గా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో నిర్మల్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, ఆదిలాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. విజేతలకు లక్ష్మణచాంద ఎంపీపీ బహుమతులు అందజేశారు. ఎస్ఎంసీ చైర్మన్ నవీన్, మండల నోడల్ అధికారి అశోక్ వర్మ, ఎఫ్ఏఓ జిల్లా పరీక్షా విభాగ కమిషనర్ సిద్ద పద్మ, జిల్లా ఎస్ జీఎఫ్ కార్యదర్శి రామారావు, ఎంపీడీఓ శేఖర్, సర్పంచ్ ముత్యంరెడ్డి పాల్గొన్నారు.
క్రీడలతోనే మానసికోల్లాసం
భైంసా: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని భైంసా మున్సిపల్కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. భైంసాలోని కిసాన్గల్లీలోని సరస్వతి శిశుమందిర్ హైస్కూల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల విభాగ్ స్థాయి పోటీలు నిర్వహించారు. రెండ్రోజుల పాటు పోటీలు జరుగనున్నాయి. రెండు జిల్లాల నుంచి 600 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎంఈఓ సుభాష్, కౌన్సిలర్ గాలి రవి, పాఠశాల సమితి అధ్యక్షుడు కృష్ణదాస్ పాల్గొన్నారు.