హాకీకి పుట్టిల్లు హుజూరాబాద్ : వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు

హాకీకి పుట్టిల్లు హుజూరాబాద్ : వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు

 హుజూరాబాద్​ వెలుగు:  కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా హుజూరాబాద్ టౌన్ లోని స్థానిక హైస్కూల్ గ్రౌండ్ లో అండర్ –14 ఎస్ జీఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే, హాకీ క్రీడాకారుడు నాగరాజు  ప్రారంభించి మాట్లాడారు.  హాకీకి హుజురాబాద్ పుట్టిల్లు వంటిదని,  ఇక్కడి నుంచి ఎంతోమంది రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదిగారన్నారు.  అండర్​– 14 రాష్ట్ర స్థాయి పోటీలు హుజూరాబాద్​లో నిర్వహించడం గర్వకారణమన్నారు.  క్రీడల్లో  గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. 

ఉమ్మడి 10 జిల్లాల నుంచి బాలురు10,  బాలికలు 10 టీమ్ పోటీల్లో పాల్గొంటున్నాయి.  ముందుగా చిన్నారుల క్రీడా ప్రదర్శన ఆకట్టుకుంది. హుజురాబాద్ టౌన్ సీఐ తిరుమల గౌడ్, జెన్​ప్యాక్​ వైస్​ ప్రెసిడెంట్​సబ్బని వెంకట్​లు ముఖ్య అతిథులుగా హాజరవగా..  వ్యాయామ ఉపాధ్యాయులు ఏముల రవికుమార్, సారయ్య, సీనియర్​క్రీడాకారులు పాల్గొన్నారు.