
హనుమకొండ, వెలుగు: హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్ లెవెల్ అండర్-15, అండర్ 20 కుస్తీ పోటీలను వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి దాదాపు 600 మంది రెజ్లర్లు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు.
విజేతలుగా నిలిచిన వారు ఈ నెల 11 నుంచి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారు. తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం, డీవైఎస్వో జి.అశోక్ కుమార్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ వరద రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, వరంగల్ జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బి.కైలాసం యాదవ్, వివిధ జిల్లాల రెజ్లింగ్ సంఘాల బాధ్యులు రాజ్ కుమార్, జైపాల్, రియాజ్, కాశీ హుస్సేన్, సాయిలు, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.