- తెలంగాణ వర్సెస్ ఉత్తరాఖండ్మ్యాచ్ టై
- ఇరుజట్లకు సమానంగా39 పాయింట్లు
కామారెడ్డి, వెలుగు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అండర్–17 బాలుర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండో సోమవారం పొద్దున, సాయంత్రం 8 చొప్పున మ్యాచ్‌లు నిర్వహించారు. తెలంగాణ, ఉత్తరాఖండ్ జరిగిన మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. నిర్ణీత టైమ్‌లో రెండు టీమ్‌లు 39 పాయింట్లు సాధించాయి.
దీంతో మ్యాచ్‌టైగా ముగిసింది. కేరళ వర్సెస్ ఉత్తర్ ప్రదేశ్ మ్యాచ్‌లో 12 పాయింట్ల తేడాతో యూపీ జట్టు విజయం సాధించింది. హిమచల్‌ప్రదేశ్, కర్నాటక మధ్య జరిగిన మ్యాచ్‌లో కర్నాటక బోణీ కొట్టింది. నవోదయ విద్యాలయాలు వర్సెస్ ఢిల్లీ మధ్య జరిగిన పోటీలో ఢిల్లీ విజేత గా నిలిచింది. రాజస్థాన్ వర్సెస్ఛత్తీస్గఢ్మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది.
చివరకు రాజస్థాన్ జట్టు 3 పాయింట్లతో చత్తీస్‌గఢ్‌ను ఓడించింది. బీహార్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన గేమ్ ఏకపక్షంగా సాగింది. 28 పాయింట్ల తేడాతో బీహార్ గెలుపొందింది. కేంద్రీయ విద్యాలయం (కేవీఎస్) వర్సెస్ఒడిశా మధ్య జరిగిన మ్యాచ్‌లో 9 పాయింట్ల (51-40) తేడాతో కేంద్రీయ విద్యాలయం విజయం సాధించింది. జార్కండ్, మహారాష్ట్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర విజయాన్ని అందుకుంది.
జమ్మూ కశ్మీర్ వర్సెస్సీబీఎస్ మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్ విన్నయింది. తమిళనాడు వర్సెస్ పాండిచ్చేరి జట్ల మధ్య పోటీలో (45–21 పాయింట్లు) 24 పాయింట్లతో తమిళనాడు జట్టు గట్టెక్కింది. ఆంధ్రావర్సెస్ గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్‌లో (23-41 పాయింట్లు) 18 పాయింట్ల తేడాతో గుజరాత్ టీమ్ ఆంధ్రా జట్టును ఓడిచింది.