పాలమూరు, వెలుగు: పట్టణంలోని స్టేడియం గ్రౌండ్లో శుక్రవారం అండర్–-17 నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత, ఉమ్మడి జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ హాజరై పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనవర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టోర్నీలో దేశంలోని వివిధ రాష్ట్రాల జట్లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు క్రీడా పతాకాలను ఆవిష్కరించారు.