హోరా హోరీ పోరుకు రంగం సిద్ధం.. కప్పుపైనే ఇండియా కుర్రాళ్ల గురి

హోరా హోరీ పోరుకు రంగం సిద్ధం.. కప్పుపైనే ఇండియా కుర్రాళ్ల గురి

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఓవైపు ఎనిమిదిసార్లు టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఇండియా.. మరోవైపు డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యాయి. ఆదివారం జరిగే కుర్రాళ్ల మెగా పోరులో ఇరుజట్లు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. 2023లో జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాను ఇంటికి పంపి విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదే చరిత్రను పునరావృతం చేయాలని భావిస్తుంటే.. అదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు మూడేళ్ల టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరువును అధిగమించాలని ఇండియా కృత నిశ్చయంతో ఉంది.  

ఇండియా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బంగ్లా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య హోరాహోరీ సమరం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓపెనర్లు ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రె (175), వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీ (167)పై ఇండియా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారం ఎక్కువగా ఆధారపడి ఉంది. బంగ్లా తమ బౌలింగ్ లీడర్లు మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ ఇద్దరు చెరో 10 వికెట్లతో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.