హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాల్గో ఫ్లోర్ కు సెంట్రింగ్ పనులు చేస్తుండగా మూడో అంతస్థు శ్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో బిల్డింగ్ కూలడంతో పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇద్దరు కూలీలను బయటకు తీయగా.. తీవ్రంగా గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
కూకట్పల్లి బీజేపీ పార్టీ ఆఫీసు పక్కనే ఈ నిర్మాణం జరుగుతోంది. బిల్డింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలన్న తొందరే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. నాసిరం పనులే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు.