భూగర్భ విద్యుత్ లైన్స్ ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​లో అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ నెట్​వర్క్ కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. గ్రేటర్ అంతటా ఓవర్ హెడ్ లైన్ల స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ మార్చేందుకు కంపెనీల నుంచి ఆసక్తి (ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్)ని ఆహ్వానిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా ప్రజాభద్రత, పటిష్టమైన నెట్వర్క్, సిటీ బ్యూటీ మెరుగుపడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్​ను ప్రపంచ నగరాల్లో ఒకటిగా నిలబెట్టడానికి మరింత వీలు కల్పిస్తుందని చెప్పారు. పూర్తి వివరాలను డిస్కమ్  tgsouthernpower.org  వెబ్​సైట్​లో చూడాలని సూచించారు.