ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

నేరేడుచర్ల, వెలుగు : ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బూర్గులతండాలో శనివారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఓరియంటల్​ ఇన్సూరెన్స్​పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం రివర్ హాస్పిటల్ డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ రాజు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్ అందజేశారు.

కార్యక్రమంలో సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ సావిత్రి, సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ వినయ్ సాగర్, మేనేజర్ అనురాధ, సాయి చౌహన్, వినోద్ కుమార్, సబ్ స్టాఫ్ రమేశ్, మాజీ సర్పంచ్ నాగు, పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.