
నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన 11వ మిలాన్ (బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు) విన్యాసాలు తొలిసారిగా విశాఖపట్టణంలో 2022 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు నిర్వహించారు. ఈ విన్యాసాలకు భారత నౌకాదళం సారథ్యం వహించింది.
స్నేహం–సమన్వయం–సహకారం‘ థీమ్‌తో 2022 ఏడాది మిలాన్ విన్యాసాలు నిర్వహించారు. విశాఖపట్టణంలోని తూర్పు నావికాదళం(ఈస్ట్రన్ నేవల్ కమాండ్) ప్రధాన స్థావరంలో ఈ విన్యాసాలు జరిగాయి. మిలాన్ విన్యాసాల్లో 39 దేశాలు పాల్గొన్నాయి.
- రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే మిలాన్ విన్యాసాలు 1995లో ప్రారంభమయ్యాయి. మిలాన్ అంటే హిందీలో సమావేశం అని అర్థం. వివిధ దేశాల మధ్య సుహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడంతోపాటు శత్రు సైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తుంటారు.
- ఇప్పటివరకు 11 సార్లు మిలాన్ విన్యాసాలు జరిగాయి.
- మిలాన్‌ను మినీ ఐఎఫ్ఆర్గా పిలుస్తారు. ఈసారి జరిగిన మిలాన్ – 2022లో అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ (ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ – ఐఎఫ్ఆర్)కు దీటుగా 39 దేశాలు పాల్గొన్నాయి.