‘గృహ ఉత్సవ్‌‌’ పేరుతో హోం లోన్స్

హైదరాబాద్​, వెలుగు : పిరమల్ ఎంటర్‌‌ప్రైజెస్‌‌ లిమిటెడ్‌‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పిరమల్ క్యాపిటల్‌‌ అండ్‌‌  హౌసింగ్‌‌ ఫైనాన్స్‌‌ లిమిటెడ్‌‌ (పీసీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌)  వరంగల్‌‌లో మొట్టమొదటిసారిగా  ‘గృహ ఉత్సవ్‌‌’ పేరుతో  ప్రాపర్టీ ఎగ్జిబిషన్‌‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ కంపెనీ అందుబాటులో వడ్డీరేట్లకు హోంలోన్లను ఇస్తోంది. శాలరీ​, సెల్ఫ్​ఎంప్లాయ్​మెంట్​ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. గృహ ఉత్సవ్‌‌ను జూలై 16,  జూలై 17, 2022 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి  8 గంటల వరకూ నక్కలగుట్టలోని ఏకశిల హాల్లో నిర్వహించనున్నారు. ఈ కంపెనీ హోంలోన్లపై వడ్డీని  25బీపీఎస్‌‌ తగ్గించడంతో పాటుగా లాగిన్‌‌ ఫీజుగా రూ.499 మాత్రమే వసూలు చేస్తోంది.  అవసరమైన పత్రాలను తీసుకువస్తే అక్కడికక్కడే హోంలోన్​ మంజూరు చేస్తారు.  29 ప్రాజెక్టుల్లో ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయని, వీటిని కనకదుర్గ హోమ్స్‌‌, వీ కన్‌‌స్ట్రక్షన్‌‌, హరిహర కన్‌‌స్ట్రక్షన్‌‌,  శ్రీ మావీ (సిగ్నెట్‌‌) వంటి 12 మంది డెవలపర్లు అందిస్తున్నారని పిరమల్​ తెలిపింది.