రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి భారీగా నాలా రోడ్డు కుంగిపోయింది. గోషామహల్‌లో దారుసలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే రోడ్డు లో ప్లైవుడ్ దుకాణాల ముందు రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కూలిపోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కూలిపోయింది. మంగళవారం రాత్రి 2గంటల ప్రాంతంలో ఇది జరిగింది. కాబట్టి.. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శివరేజ్ పెద్ద నాలా అతిపూరాతనమైనదని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం కుంగిన ప్రదేశానికి 200వందల మీటర్ల దూరంలో గతంలో కూడా నాలా రోడ్డు డ్రైనేజ్ లో కూలిపోయింది.