హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో చేపట్టిన రెయిన్వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మున్సిపల్ప్రిన్సిపల్సెక్రెటరీ దానకిశోర్ఆదేశించారు. శనివారం ఆయన అధికారులతో కలిసి రాజ్‌భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సచివాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న రెయిన్వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్పనులను పరిశీలించారు.
10 లక్షల నుంచి 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో గ్రేటర్‌పరిధిలో12 రెయిన్వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు నిర్మిస్తున్నామని, ఇప్పటికే నాలుగు పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టడంతోపాటు రోడ్లపై నీరు నిల్వకుండా, ట్రాఫిక్సమస్యలకు చెక్‌పెట్టేందుకు వీటిని నిర్మిస్తున్నామని దానకిశోర్ తెలిపారు. అనంతరం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులతో కలిసి నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, అసెంబ్లీ, సచివాలయం, సంజీవయ్య పార్క్ రోడ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన– ప్రజా విజయోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్‌రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోందని, ఈ ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రధాన మార్గాలను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని దానకిశోర్ అధికారులను ఆదేశించారు. సైన్‌బోర్డులు, లైటింగ్ఏర్పాటు చేయాలన్నారు. జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని, ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. అవసరమైన చోట కొత్తగా రోడ్లు వేయాలని, రిపేర్లు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఎంఏయూడీ డిప్యూటీ సెక్రెటరీ ప్రియాంక, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ఉన్నారు.