ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు న్యాయం చేయాలి : నిరుద్యోగ కళాకారులు

ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు న్యాయం చేయాలి : నిరుద్యోగ కళాకారులు

ఆసిఫాబాద్, వెలుగు: తమకు న్యాయం చేయాలని, సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ ఆసిఫాబాద్ జిల్లా నిరుద్యోగ కళాకారులు కోరారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి గురువారం నివాళులు అర్పించి  మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధనలో కళాకారుల పాత్ర ఎనలేనిదని, కళాకారులు లేని ఉద్యమాన్ని ఊహించలేమన్నారు.

భుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి సాంస్కృతిక సారథిలో తమకు ఉద్యోగాలు కల్పించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల అధ్యక్షురాలు సంధ్య, డొంగిరి సంతోష్, మేడి కార్తీక్, సమ్మక్క, రణధీర్, ఆర్యన్ రాథోడ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.