ఐటీ కంపెనీకి రెజ్యూమ్ పంపిన అభ్యర్థి.. ఆ కంపెనీకే ఆఫర్ ఇచ్చాడు.. నాకు ఉద్యోగం ఇవ్వండి.. మీ కంపెనీకి 500 డాలర్లు ఇస్తానంటూ ఆఫర్ ప్రకటించాడు.. ఎవరైనా ఉద్యోగం కావాలని కోరతారు.. ఈ ఐటీ అభ్యర్థి మాత్రం ఏకంగా కంపెనీకే ఆఫర్ ఇవ్వటం సంభ్రమాశ్చార్యాలకు గురి చేస్తుంది. ఐటీ కంపెనీల్లో బ్యాక్ డోర్ రిక్రూట్ మెంట్ పై ఈ అభ్యర్థికి అవగాహన ఉందా ఏంటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇదే టైంలో రెజ్యూమ్ తో 500 డాలర్లు ఆఫర్ ఇవ్వటంపై.. ఆ కంపెనీ కూడా స్పందించింది.. ఆ పూర్తి వివరాలు ఏంటో చూద్దామా...
ఢిల్లీలోని Wingify సాఫ్టవేర్ కంపెనీ బ్రాంచ్ లో జాబ్ కోసం ఓ అన్‌ఎంప్లాయ్ వినూత్నంగా ప్రయత్నించాడు. రెస్యూమ్ లో నాకు ఈ జాబ్ ఇస్తే 500 డాలర్లు ఇస్తా అని రాశాడు. వారం రోజుల్లో అతని టాలెంట్ నిరూపించుకోకుంటే 500 డాలర్లు తిరిగివ్వకండి అని చాలా కాంఫిడెట్ గా చెప్పాడు. అంతేకాదు తన ఆఫర్ నచ్చకుంటే వెంటనే రిజక్ట్ చేయమని రాసి మీ టీం టైం వేస్ట్ చేయాలనుకోవడం లేదని రెస్యూమ్ లో రాశాడు. లాస్ట్ గా మీ రిజక్షన్ కోసం ఎదురుచూస్తున్నా అని కూడా పేర్కొన్నాడు.
This is how you get attention!
— Paras Chopra (@paraschopra) May 3, 2024
(Obviously won’t take money but very impressed with the pitch) pic.twitter.com/mlJIL0154u
అయితే ఆ రెస్యూమ్ కంపెనీ ఛైర్మన్ పరాస్ చోప్రాను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఆయన దాన్ని ఎక్స్ లో షేర్ చేశాడు. కంపెనీ అటెక్షన్ ఎలా పొందాలనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అపి వింగిఫై సీఈఓ ట్విట్ చేశాడు. నేను ఆ డబ్బు ఏం తీసుకోని గాని ఆయన మాటలు తనకు చాలా నచ్చాయని చెప్పాడు. ఈ ట్విట్ పై నెటిజన్లు డిఫరెట్ గా రియాక్ట్ అవుతున్నారు. దీంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది.