న్యూఢిల్లీ: పట్టణాల్లో నిరుద్యోగం ఈ ఏడాది ఏప్రిల్– జూన్ క్వార్టర్‌లో తగ్గింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో 6.7 శాతంగా రికార్డయిన నిరుద్యోగం రేటు, జూన్ క్వార్టర్‌లో 6.6 శాతానికి దిగొచ్చింది. ముఖ్యంగా మగవాళ్లలో నిరుద్యోగం తగ్గిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) ప్రకటించింది.
సర్వేకు ముందు ఏడు రోజులను పరిగణనలోకి తీసుకొని లెక్కించే నిరుద్యోగం రేటు మగవారికి సంబంధించి 5.8 శాతంగా నమోదయ్యింది. మార్చి క్వార్టర్‌లో 6.1 శాతంగా ఉంటే, జూన్ క్వార్టర్‌లో తగ్గింది. మహిళల నిరుద్యోగం రేటు 8.5 శాతం నుంచి 9 శాతానికి పెరిగింది.