కొలువుల్లేనోళ్లు కోకొల్లలు

మన దేశంలో ఎంప్లాయ్ మెంట్ లేనివాళ్ల సంఖ్య ఎంతో తెలుసుకునే లోపే ఆ నెంబర్ అనూహ్యంగా మారిపోతోంది. ఒక వైపు ఈ లెక్కలన్నింటినీ సరిచూసుకుంటుం టే మరో వైపు అంతకన్నా ఎక్కువ మందే జాబు కోసం క్యూ కడుతున్నారు. గత రెండున్నరేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిరుద్యోగం రేటు 7.2 శాతానికి పెరిగింది. దీనినిబట్టి నిరుద్యోగం స్పీడును అర్థం చేసుకోవచ్చు. పోటీ ప్రపంచంలో జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టలేనివాళ్ల పర్సంటేజీ డిమానిటైజేషన్‌ (2016 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎన్నడూలేదు. నౌకరీ కోసం ఎదురుచూస్తున్నవాళ్ల సంఖ్య ఒక్క ఏడాదిలోనే 1.3 శాతం అధికంగా నమోదైంది. 2018 ఫిబ్రవరిలో అన్​ఎంప్లాయ్మెంట్ రేట్ పర్సంటేజ్ 5.9 శాతం. ఇది 2019 ఫిబ్రవరి నాటికి 7.2 శాతానికి చేరిం ది. ‘ఉద్యోగం మహాప్రభో’ అంటున్నవాళ్ల సంఖ్యను ఇటీవల ‘సెంటర్ ఫర్ మోనిటరింగ్​ ఇండియన్​ ఎకానమి (సీఎంఐఈ)’ డేటా వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఇండియా మొత్తం మీద జాబ్స్‌ లో చేరినవారు 40.6 కోట్ల మంది ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 40 కోట్లకు తగ్గింది.

ఈ సర్వేలో భాగంగా సీఎంఐఈ దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిప్రాయాలను నేరుగా సేకరించింది. ఎంతో మంది ఎకనమిస్టు లు ఈ గణాం కాలనే క్రెడిబుల్ గా భావిస్తున్నా రు. సర్కారు చెప్పుకునే జాబ్ లెస్ డేటా కంటే, దీనినే పరిగణనలోకి తీసుకోవడం విశేషం. ఈ డేటా మోడీ సర్కారుకి ఏమాత్రం మింగుడు పడని విషయమే. జనరల్ ఎలక్షన్​ సమయంలో ఇలాంటి చేదు నిజాలు వెలుగులోకి రావటాన్ని ప్రభుత్వాలు సహించవు. ఆరుగాలం శ్రమించి పండించే పంటలకు సరైన రేట్లు లేకపోవటంతో రైతులు ఇప్పటికే పీకల దాక కోపంతో ఉన్నా రు. అన్నదా తల్లోని ఈ అసంతృప్తి అపొజిషన్​ పార్టీకి అనుకూలంగా మారితే కష్టం. దేశంలో నిరుద్యోగ శాతంపై అధికార బీజేపీ తీవ్ర ఆందోళనతో ఉంది. జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నవారి అధికారిక వివరాలను మోడీ ప్రభుత్వం గతంలోనే అందుబాటులోకి తెచ్చింది. కానీ, అది అప్పటికే ‘ఔట్ –ఆఫ్ –డేట్’ అయిపోయిం ది. ఈ నేపథ్యం లో తాజా డేటాని రిలీజ్​ చేయాలని భావించినా చివరి నిమిషంలో నిలిపేసింది. సమాచారాన్ని మరోసారి చెక్ చేయటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా మని చెప్పటం అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల ముందు ఎందుకీ గందరగోళం అనుకుందేమో. అయినా ఇలాంటి విషయాలు దాచినా దాగవు. ఎక్కడ ఏ చిన్న జాబ్ మేళా జరిగినా చదువుకున్నోళ్లు చాంతాడంత క్యూ లైన్లలో దర్శనమిస్తుండటాన్ని తరచుగా పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం .

దేశంలోని నిరుద్యోగుల సంఖ్య బయటకు పొక్కకుండా కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ లో తగిన జాగ్రత్త చర్యలు చేపట్టినా కొద్ది వారాల కిందట లోకల్ న్యూస్ పేపర్లలో లీక్ అయ్యింది. గత 45 ఏళ్లలో కనీవినీ ఎరగని హయ్యస్ట్​ లెవల్ లో 2017–18లో అన్​ఎంప్లాయ్ మెంట్ రేట్ ఆకాశాన్నంటడంతో ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. 2016లో అమల్లో కొచ్చిన డీమానిటైజేషన్ వల్ల కోటీ పది లక్షల ఉద్యోగాలు హుష్ కాకి అయినట్లు సీఎఐఈ రిపోర్ట్​ రెండు నెలల కిందట బల్లగుద్ది చెప్పటం కూడా అంతే షాక్ కు గురిచేసింది. దీనికి తోడు 2017 లో మొదలైన కొత్త జీఎస్ టీతో చిన్న వ్యాపారాలు లక్షల సంఖ్యలో దెబ్బతిన్నాయి. కళ్ల ముందు వాస్తవాలు ఇలా కనిపిస్తుంటే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావానికి సంబంధించిన డేటా తమ వద్ద లేదంటూ గవర్నమెంట్ గతనెలలో పార్లమెంట్ లో సింపుల్ గా చెప్పేసి చేతులు దులుపుకుంది. తమ నిర్ణయాల ఎఫెక్ట్​ ఎవరిపై ఏ రేంజ్​లో ఉంటుందనే కనీస ముందస్తు అంచనా లేకపోతే అంతకుమించిన నిర్లక్ష్యం మరొకటి ఉండదు.