బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బీఆర్ఎస్ పాలనలో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని విమర్శించారు. చదువకున్న యువకులకు ఉద్యోగాలు ఇవ్వక వారితో ఆటలాడారని ఫైర్ అయ్యారు. పెద్దపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో వంశీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చామని చెప్పారు. కాకా చూపించిన బాటలో పేదలకు కోసం పని చేస్తానని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్, రేషన్ వంటి స్కీమ్స్ తెచ్చింది కాకా అని గుర్తు చేశారు. పేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. కాకా కుటుంబానికి పెద్దపల్లితో ఎంతో అనుబంధం ఉందని, ఎంతో మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. తొలి దశ ఉద్యమంలో కాకాది కీలక పాత్ర ఉందని గడ్డం వంశీకృష్ణ గుర్తు చేశారు.