భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కు ప్రతిష్టాత్మక యునెస్కో అవార్డు దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన విద్యాసంస్థ అయిన కళింగ ఇన్ స్టిట్యూట్ విద్యారంగంలో సాధించిన ప్రగతికి గుర్తింపుగా ‘యునెస్కో ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్ 2022’ను గెలుపొందింది. పశ్చిమాఫ్రికాలోని ఐవరీ కోస్ట్ లో గురువారం ఇంటర్నేషనల్ లిటరసీ డే (సెప్టెంబర్ 8) సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ ఇన్ స్టిట్యూట్‌కు అవార్డు ప్రదానం చేశారు.
Congratulations @kissfoundation for receiving the UNESCO Literacy Prize. KISS's impact on literacy is irreversible and the result is for the world to see. So far, the world has seen just the tip of what they're set to achieve.#KISSWinsUNESCOLiteracyPrize pic.twitter.com/vXqSjqy34v
— KIIT - Kalinga Institute of Industrial Technology (@KIITUniversity) September 8, 2022
అవార్డు కింద రూ.16 లక్షలు, మెడల్, సైటేషన్ అందజేశారు. యునెస్కో లిటరసీ ప్రైజ్‌ను అందుకున్న తొలి ఒడిశా విద్యా సంస్థగా, ఐదో ఇండియన్ సంస్థగా కళింగ ఇన్ స్టిట్యూట్ నిలిచింది. ఈ అవార్డు అందుకున్న మూడో ఎన్జీవో, తొలి ఇండియన్ ట్రైబల్ ఆర్గనైజేషన్ కూడా ఇదే కావడం విశేషం.