యునెస్కో హెరిటేజ్​ కన్జర్వేషన్ 2024 అవార్డ్స్ కు ఎంపికైన భారతీయ ప్రాంతాలు..

యునెస్కో హెరిటేజ్​ కన్జర్వేషన్ 2024 అవార్డ్స్ కు ఎంపికైన భారతీయ ప్రాంతాలు..

యునెస్కో ఆసియా పసిఫిక్​ అవార్డ్స్ ఫర్​ కల్చరల్​ హెరిటేజ్​ కన్జర్వేషన్​ 2024లో భాగంగా అవార్డ్​  ఆఫ్​ డిస్టింక్షన్​, అవార్డ్​ ఆఫ్​ మెరిట్​కు భారత్​లోని రెండు ప్రాంతాలు ఎంపికైనట్లు యునెస్కో ప్రకటించింది. తమిళనాడులో తంజావూరు జిల్లా అభత్సహాయేశ్వర్​ టెంపుల్​ కన్జర్వేషన్ ప్రాజెక్ట్​, మహారాష్ట్రలోని  సర్​ బెనర్జీ పార్సీ చారిటబుల్​ ఇన్​స్టిట్యూషన్​(బీజేపీసీఐ) కన్జర్వేషన్​ ప్రాజెక్టులు ఎంపికైన వాటిలో ఉన్నాయి.

అభత్సహాయేశ్వర్​ టెంపుల్​

తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా అలాంగుడి గ్రామంలో 1300 సంవత్సరాల క్రితం చోళ వంశీయుల రాజు విక్రమచోళుడు, కులోత్తుంగచోళుడు అభత్సహాయేశ్వర్​ ఆలయాన్ని నిర్మించాడు. ఇందులో సౌందర్యనాయకి అంబాల్​, అష్టభుజ దుర్గా పరమేశ్వరి, ఆది శరబేశ్వర్​, పిల్లయూర్​, మురగన్​, చండీకేశ్వరుడితో సహా అనేక ఆలయాలు ఉన్నాయి. అభత్సహాయేశ్వర్​ టెంపుల్​ దక్షిణామూర్తికి అంకితం చేశారు. 

బీజేపీసీఐ కన్జర్వేషన్​ ప్రాజెక్టు

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని సర్​ బెనర్జీ పార్సీ చారిటబుల్​ ఇన్​స్టిట్యూషన్​(బీజేపీసీఐ) కన్జర్వేషన్​ ప్రాజెక్ట్​ ఇదో చారిత్రాత్మక విద్యా సంస్థ. సమాజంలో ఆర్థికంగా బలహీనవర్గాలకు విద్యను అందించాలన్న ఉద్దేశంతో మహారాష్ట్రలోని ముంబయిలో 1908లో గోథిక్​ శైలిలో నిర్మించారు. 

అవార్డు గురించి

యునెస్కో ఆసియా పసిఫిక్​ అవార్డ్​ ఫర్​ కల్చరల్​ హెరిటేజ్​ కన్జర్వేషన్​ 2000లో యునెస్కో ప్రారంభించింది. ఆసియా, పసిఫిక్​ ప్రాంతంలోని ప్రాచీన నిర్మాణాలను, స్మారక చిహ్నాలను పరిరక్షించడానికి, పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలకుగాను వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డు ఇస్తారు.

యునెస్కో

ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీ యునెస్కో. ఈ సంస్థను 1945లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం పారిస్​లో ఉంది.  దీని లక్ష్యం విద్య, కళలు, సైన్స్​, సంస్కృతిలో అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రపంచ శాంతి, భద్రతను ప్రోత్సహించడం. ప్రస్తుతం 195 సభ్య దేశాలు, ఎనిమిది అసోసియేట్​సభ్యదేశాలు ఉన్నాయి.