మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తేవాలి

మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తేవాలి
  • పంచాయతీ రాజ్‌‌‌‌శాఖ మంత్రి సీతక్క

తాడ్వాయి, వెలుగు : ఎనిమిది వందల ఏండ్ల చరిత్ర కలిగిన మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తీసుకురావాలని మంత్రి సీతక్క చెప్పారు. మేడారంలో క్యూలైన్ల పైన షెడ్లు, వీవీఐపీల దారి కోసం చేస్తున్న పనులకు మంగళవారం రాత్రి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భవిష్యత్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకొని, మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

 జంపన్న వాగు నుంచి దేవతల గద్దెల వరకు ఉన్న రోడ్డు వెడల్పు చేసి సెంట్రల్‌‌‌‌ లైటింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ఏర్పాటుకు ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఫిబ్రవరిలో మేడారం మినీ జాతర జరగనున్న నేపథ్యంలో పూజారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మినీ జాతరను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మినీ జాతరకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. మహా జాతర విజయవంతంలో పూజారులు, ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఈవో రాజేంద్ర, పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు.

గోదావరి జలాలతో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం

ములుగు, వెలుగు : గోదావరి జలాలతో ములుగు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ములుగు పంపు హౌజ్‌‌‌‌ నుంచి జంగాలపల్లి, బంజరుచెరువులకు బుధవారం గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం ములుగు నియోజకవర్గానికి చుక్క నీరు కూడా ఇవ్వకుండా, సిద్దిపేట, సిరిసిల్లకు తరలించుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ నుంచి భవిష్యత్‌‌‌‌లో కొత్తగూడ, గంగారాం మండలాలకు గోదావరి జలాలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌‌‌‌ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ బానోత్‌‌‌‌ రవిచందర్‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్‌‌‌‌ సందర్భంగా స్థానిక చర్చిలో క్రిస్టియన్లతో కలిసి కేక్‌‌‌‌ కట్‌‌‌‌ చేసి 
శుభాకాంక్షలు తెలిపారు.

గాంధీనగర్‌‌‌‌ గురుకులంలో రాత్రి నిద్ర

కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడలోని గాంధీ నగర్‌‌‌‌ బాలికల గురుకులంలో మంత్రి సీతక్క బుధవారం రాత్రి నిద్ర చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్లతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్లు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని చేరుకునేందుకు కృషి చేయాలని సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, ప్రిన్సిపాల్‌‌‌‌ కల్పన, మాజీ జడ్పీటీసీ పుష్పలత, మండల
 అధ్యక్షుడు వజ్జ సారయ్య పాల్గొన్నారు.