వెలిచాల గ్రామంలో యునిసెఫ్‌‌‌‌ టీం పర్యటన 

వెలిచాల గ్రామంలో యునిసెఫ్‌‌‌‌ టీం పర్యటన 

రామడుగు, వెలుగు: రామడుగు  మండలం వెలిచాల గ్రామాన్ని యునిసెఫ్‌‌‌‌ బృందం సందర్శించింది. గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను,  స్కూల్‌‌‌‌లో ఏర్పాటుచేసిన విటమిన్ గార్డెన్ ను, స్టూడెంట్స్ హ్యాండ్ వాష్ పద్ధతిని పరిశీలించారు. గ్రామంలోని అంగన్​వాడీలో చిన్నారులకు అన్నప్రాశన చేశారు. అనంతరం కలెక్టరేట్​లో కలెక్టర్​తో యునిసెఫ్​ ప్రతినిధులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ యునిసెఫ్ సహకారంతో కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నామన్నారు. జిల్లాలో  చేపడుతున్న స్వచ్ఛతా ప్రోగ్రామ్స్‌‌‌‌ను యునిసెఫ్​ టీం ప్రశంసించినట్లు వెల్లడించారు. యునిసెఫ్​ ప్రతినిధులు పౌలేజి వర్క్ నే, మనీష్ వసూజ, వెంకటేశ్, ప్రభాత్, ఫణీంద్ర, అధికారులు పాల్గొన్నారు.