రామాయంపేట,వెలుగు: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఓ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దీపావళి సుతిలి బాంబులతో సోమవారం రాత్రి దాడి చేయగా కొద్ది మేర ధ్వంసమైంది. ఎస్ఐ బాల్ రాజ్, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నడిమింటి రాజమణి తన పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతున్న క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఇంటిపై పెద్ద శబ్ధం అయి మంటలు లేచాయి.
దీంతో వారు నిద్ర లేచి మంటలపై నీళ్లు పోసి ఆర్పారు. ఇంట్లో రాజమణితో పాటు కుమారుడు భాను చందర్, ఇద్దరు కుమార్తెలు, ఆమె అత్తమ్మ ఉన్నారు. సకాలంలో మంటలను ఆర్పకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.