ఆదిలాబాద్ జిల్లాలో  కలకలం .. రోడ్డుపైన మనిషి పుర్రె, ఎముకలు

ఆదిలాబాద్ జిల్లాలో  కలకలం .. రోడ్డుపైన మనిషి పుర్రె, ఎముకలు

నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో మని షి పుర్రె, ఎముకలు కనిపించి కలకలం రేపాయి. నేరడిగొండ మండలం నారాయణపూర్ గ్రామ శివారులో రోడ్డు పక్కన సోమవారం గుర్తు తెలియని వ్యక్తి పుర్రె, వెన్నుపూస, కాళ్లు, చేతుల ఎముకలను స్థానికులు చూశారు. ఇవి పడి ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలో కాల్చివేసిన ఆనవాళ్లు కనిపించాయి. 

దీంతో భయాందోళన చెందిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనా స్థలానికి వెళ్లి పుర్రె, ఎముకలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.