వీడెవడండీ బాబూ: రైల్వే స్టేషన్లలో అమ్మాయిల జుట్టు కత్తిరిస్తున్న సైకో

వీడెవడండీ బాబూ: రైల్వే స్టేషన్లలో అమ్మాయిల జుట్టు కత్తిరిస్తున్న సైకో

ఒక్కొక్కడికి ఒక్కో పిచ్చి.. ఒక్కోరిది ఒక్కో మెంటాలిటీ.. ముంబైలో ఇప్పుడు కొత్తగా ఒక సైకో పుట్టుకొచ్చాడు. వీడు కొట్టడు.. తిట్టడు.. వీడిదో పిచ్చి.. మెంటల్. రైల్వే స్టేషన్లు అడ్డాగా.. అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నాడు.. అలా అని అమ్మాయిలను వెంటపడి వేధించడు.. కొట్టడు.. తిట్టడు.. జస్ట్.. అమ్మాయిల జుట్టు కత్తించి పారిపోతుంటాడు. చేతిలో పదునైన కత్తెరతో.. అమ్మాయిల జుట్టును వెనక నుంచి కట్ చేస్తుంటాడు.. ఇప్పుడు ఈ సైకో దెబ్బకు.. రైల్వేస్టేషన్ కు వచ్చే అమ్మాయిలు భయపడిపోతున్నారు. పోలీసులు సైతం వీడిని పట్టుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యారు.. అమ్మాయిలు కంప్లయింట్ చేసిన రైల్వే స్టేషన్లలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు..

బాధితురాలు, ముంబైలోని ప్రసిద్ధ కళాశాలకు చెందిన విద్యార్థి. మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక లోకల్ రైలులో కళ్యాణ్ నుండి మాతుంగా రోడ్ (డబ్ల్యూఆర్)కి వెళ్తోంది. ఆమె దాదర్ స్టేషన్‌కు చేరుకుని.. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి వైపు నడుస్తుండగా వెనుకనుండి ఓ వ్యక్తి జట్టు కత్తిరించి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందని అమ్మాయి చూసుకునేలోపే అతడు అక్కడి నుండి పరారయ్యాడు. అడ్డదిడ్డంగా కత్తిరించిన తన జట్టు.. నేలపై పడి ఉన్న వెంట్రుకలు చూసి బాధిత విద్యార్థిని లబోదిబోమని ఏడుపు లెక్కించింది. 

ALSO READ | విత్తనాలు మొలకలయ్యాయ్.. అంతరిక్షంలో ఇస్రో అద్భుతం

ఇతర ప్రయాణికులు ఆమెను ఓదార్చారు. దీనిపై బాధిత విద్యార్థిని దాదర్ (డబ్ల్యూఆర్) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఇటువంటి ఘటన మరొకటి రెండ్రోజుల తమ దృష్టికి వచ్చినట్లు దాదర్ ఆర్‌పిఎఫ్ సిబ్బంది తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

ప్రేమ విఫలం..!

ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బహుశా..! ఎవరైనా అమ్మాయి జుట్టు లేదని తన ప్రేమను తిరస్కరించేదేమో.. అందుకే ఇలా పగ తీర్చుకుంటున్నాడేమో అని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. మొత్తానికి సైకో దెబ్బకు దాదర్ రైల్వే స్టేషన్ పేరు మార్మోగుతోంది.