మఠంపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం సుల్తాన్ పూర్ తండా సమీపంలోని మట్ట పల్లి పునరావాస కేంద్రం దగ్గర ఉన్న కంప చెట్లలో గుర్తతెలియని వ్యక్తులు పసికందును వదిలివెల్లారు. కంపచెట్ల నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు వెళ్లిచూడగా.. సుమారు10 రోజుల ఆడబిడ్డ కనిపించింది.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఐసీడీఎస్ అధికారులకు చెప్పగా.. సీడీపీవో విజయలక్ష్మి అక్కడికి చేరుకొని పాపను చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.