- డీసీపీవోకు అప్పగించిన రైల్వే అధికారులు
పెద్దపల్లి, వెలుగు : రైల్వే ట్రాక్ మీద గుర్తు తెలియని వ్యక్తులు మగ శిశువును వదిలేశారు. వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రోడ్ రైల్వే గేట్ సమీపంలోని రైల్వే ట్రాక్ వైపు శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. రైల్వే సీఐ సురేశ్ గౌడ్, ఎస్సై క్రాంతి కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ట్రాక్ మీద ఉన్న మగ శిశువును పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం శిశువును పెద్దపల్లి డీసీపీవోకు అప్పగించారు. శిశువును ఎవరు వదిలివెళ్లారనే కోణంలో పెద్దపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు.