సిద్ధిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలో.. ఎమ్మెల్యే రఘునందన్ రావు నిన్న కూరగాయల మార్కెట్ ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నిన్న రఘునందన్ గుడికందులలో మినీ కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ నేతలు రఘునందన్‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్న తాను.. అధికారిక కార్యక్రమాలకు వెళ్తే భద్రత కల్పించరా అని పోలీసులను నిలదీశారు. అయితే ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కూరగాలయ మార్కెట్ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం చర్చనీయాంశం అయింది.
For More News..