వెంకట్రావ్ పేట్‌లో ఆర్చి ధ్వంసం చేసిన అక్రమార్కులు

వెంకట్రావ్ పేట్‌లో ఆర్చి ధ్వంసం చేసిన అక్రమార్కులు

కాగజ్ నగర్, వెలుగు: సిర్పూర్ టీ మండలం వెంకట్రావ్ పేట్ సమీపంలో హై లెవల్ బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాలు రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఆర్చిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ట్రాన్స్​పోర్ట్, పోలీస్, పంచాయతీ రాజ్ అధికారులు సంయుక్తంగా ఈనెల 13న వార్ధ నది ఒడ్డున ఇటీవల ఇనుప ఆర్చిని ఏర్పాటుచేశారు. టోల్ గేట్ చార్జీలు, ఇతర ట్యాక్స్​లకు గండి కొడుతూ మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్ ​రాష్ట్రాల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 

రేషన్ బియ్యం సైతం పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. వీటన్నింటినీ కంట్రోల్ చేసేలా.. పది ఫీట్ల ఎత్తుకు మించి వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు ఈ ఆర్చిని ఏర్పాటు చేయగా ధ్వంసం చేశారు. అక్రమ దందాకు పాల్పడేవారే ధ్వంసం చేశారా? లేక మరెవరైనా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.