ఘట్కేసర్, వెలుగు: పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని ఘణపూర్ ఫకీర్ టెక్యా తండాలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహంతో పాటు ఐదు గ్రాముల పుస్తెలు, ఐదు తులాల వెండి కళ్లను గురువారం అర్ధరాత్రి దుండగులు ఎత్తుకెళ్లారు.
పూజారి ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా, కీసర ఆర్ జీకే కాలనీకి చెందిన పెండెం రాజు(39), కొండోజు నర్సింహ చారి(51) ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి, సొమ్ము రికవరీ చేశామని పోచారం పోలీసులు తెలిపారు.