
- వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఘటన
నల్లబెల్లి, వెలుగు: మొక్కజొన్న చేనుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు. నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన మూడిక వీరన్న తన రెండెకరాల భూమిలో మొక్కజొన్న సాగు చేశాడు.
ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో చేతికి వచ్చిన పంట కాలిపోయింది. సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం జరిగినట్టు బాధిత రైతు వాపోయాడు. నర్సంపేట ఫైర్ సిబ్బంది, పోలీస్, రెవెన్యూ అధికారులు వెళ్లి పరిశీలించారు.