చండ్రుగొండ,వెలుగు : నాటేందుకు సిద్ధమైన మిరపనారును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన ఆదివారం తిప్పనపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన అంచ కృష్ణ తనకున్న రెండెకరాల్లో మిరప తోట వేసేందుకు నారు పెంచుతున్నాడు. కొద్ది రోజుల్లో నారు నాటేందుకు సిద్ధం చేస్తుండగా.. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎకరానికి సరిపోయే మిరపనారుని ఎత్తుకెళ్లారు.
శనివారం ఉదయం పొలానికెళ్ళి చూడగా నారు మడి లో నారు పీకెళ్ళినట్లు గమనించాడు. రూ. లక్ష విలువైన మిరపనారు చోరీకి గురైనట్లు బాధిత రైతు తెలిపాడు. రైతు ఫిర్యాదుతో దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రవి తెలిపారు.