బైకును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

బైకును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం బుదేరా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని బైకుపై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు మునిపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో ఒక మహిళా కూడా ఉన్నారు.

ఏ వాహనం వీరి బైకును ఢీకొందో కానీ, ఆ వేగానికి బైక్ దాదాపు 50 మీటర్ల దూరం ముందుకు దూసుకెళ్లింది. రోడ్డుపై పడగానే మహిళ శరీరం నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.