ఏప్రిల్​ నుంచి అమల్లోకి కొత్త యూపీఎస్​ విధానం

ఏప్రిల్​ నుంచి అమల్లోకి కొత్త యూపీఎస్​ విధానం

న్యూఢిల్లీ: యూనిఫైడ్​ పెన్షన్ ​స్కీమ్​(యూపీఎస్​) విధానం ఏప్రిల్​ నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న నేషనల్ ​పెన్షన్ ​సిస్టమ్​(ఎన్​పీఎస్​) స్థానంలో దీనిని తీసుకొచ్చారు. యూపీఎస్​ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాదే ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ పథకం (ఓపీఎస్​) ను పునరుద్ధరించాలని రిక్వెస్టులు రావడంతో యూపీఎస్‌‌‌‌ను తీసుకొచ్చారు. ఈ పథకం కింద పదవీ విరమణ చేసిన వారు తమ రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్ టైమ్‌‌‌‌లో జీతంలో 50 శాతం మొత్తాన్ని పెన్షన్‌‌‌‌గా పొందుతున్నారు. యూపీఎస్ ​ప్రకారం, ఉద్యోగులు తమ బేసిక్​ జీతంలో 10 శాతం పెన్షన్​కోసం చెల్లించాలి. ఇందులో కరువు భత్యం (డీఏ) కలిసి ఉంటుంది.

ప్రభుత్వ వాటా 14 శాతం నుండి 18.5 శాతానికి పెరుగుతుంది. దీనితో పాటు ప్రత్యేక పూల్డ్ ఫండ్ కూడా ఉంటుంది. దీనికి ప్రభుత్వం నుంచి అదనంగా 8.5 శాతం కంట్రిబ్యూషన్ ​అందుతుంది. ఫలితంగా యూపీఎస్ ​విధానంలో గత 12 నెలల సగటు ప్రాథమిక జీతంలో 50 శాతానికి సమానమైన పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తుంది. ఉద్యోగి మరణిస్తే, వారి కుటుంబానికి పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 60 శాతం లభిస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీతో పాటు వన్​టైం సెటిల్​మెంట్​ను కూడా పొందుతారు. కేంద్ర ప్రభుత్వంలో కనీసం 10 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులకు నెలకు కనీసం రూ. 10 వేల పెన్షన్ లభిస్తుంది.