న్యూఢిల్లీ: డీమార్ట్ పేరుతో స్టోర్లను ఆపరేట్ చేస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ తన సీఈఓని మార్చింది. యూఎస్ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ యూనిలీవర్ పీఎల్‌సీలో సీనియర్ పొజిషన్‌లో ఉన్న అన్షుల్ అశ్వను కొత్త సీఈఓగా ప్రకటించింది.
ప్రస్తుత డీమార్ట్ సీఈఓ నవిల్ నొరొన్హా ప్లేస్‌లో ఆయనీ బాధ్యతలు తీసుకుంటారు. ఈ ఏడాది మార్చి నుంచి డెజిగ్నేట్ సీఈఓగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అఫీషియల్ సీఈఓగా జాయిన్ అవుతారు. యూనిలీవర్ పీఎల్‌సీలో అశ్వకు 30 ఏళ్ల అనుభవం ఉంది.